గుంటూరు జిల్లాలో నానాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా పెరిగి పోతోంది. గుంటూరులో ఇప్పటివరకు 82  కేసులు నమోదు కావడం గుంటూరు వాసులను కలవరపెడుతోంది. గుంటూరులో నిన్న ఆదివారం ఒక్కరోజే మరో 5 కేసు లు రావడం గుంటూరు ప్రజలను కలవర పెడుతోంది. అయితే ఇసోలాటిన్ వార్డులో వార్డు వాలంటీర్ కి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ అతనికి కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. వార్డు వాలంటీర్ ఇంటి దగ్గర్లో ఓ వ్యక్తికీ కొరోనా పాజిటివ్ రావడం తో సదరు వ్యక్తి ఏరియా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 

 


దీనితో గుంటూరు లో హైఅలర్ట్ ప్రకటించారు . ఇంటినుండి బయటికి రావద్దని ఆదేశించారు. అత్యవసర వస్తువులకు ఎవరు బయటకి రావద్దని ప్రభుత్వం ఆదేశించింది. సరుకులు కేవలం ఇంటి వద్దకు మాత్రమే పంపుతామని ఇళ్ళనుండి బయటకి రావద్దని చెప్పారు. ఇదిలా ఉండగా ఇసోలాటిన్ వార్డ్ లోకరోనా సోకిన వార్డు వాలంటీర్ తోపాటు ఇంకొకరికి కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా రెడ్ జోన్లుగా ఆయా  ప్రాంతాలను కట్టుదిట్టం చేస్తున్నారు . ఇప్పటి వరకు ఆంధ్రాలో 420 కేసులు గా నమోదు అయ్యాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: