ఏపీ ఎస్ఈసీ తొల‌గింపు ఆర్డినెన్స్‌ను స‌వాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌రిగింది.  విచార‌ణ అనంత‌రం వ‌చ్చే సోమ‌వారానికి కేసు విచ‌రాణ‌ను కోర్టు వాయిదా వేసింది.  వ‌చ్చ గురువాం నాటికి ప్ర‌భుత్వం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. అభ్యంత‌రాలు ఉంటే శుక్ర‌వారం లోగా తెలుపాల‌ని పిటిష‌న‌ర్ల‌కు కోర్టు తెలిపారు.   అంత‌కుముందు ఆర్డినెన్స్‌ను స‌వాల్‌చేస్తూ ఆరు పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. దీంతో జ‌డ్జి విచార‌ణ‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టారు.

 

త‌న‌ను తొల‌గించ‌డం రాజ్యాంగ విరుద్ద‌మంటూ నిమ్మ‌గ‌డ్డ‌ ర‌మేశ్ కుమార్‌ కూడా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఈరోజు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు వాయిదా వేయ‌డంతో ఉత్కంఠ కొన‌సాగుతోంది. అయితే.. సోమ‌వారం వ‌ర‌కూ ఆగాల్సిందే. అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే స‌మాధానం ఆధారంగా సోమ‌వారం తుది తీర్పును హైరోర్టు ఇవ్వ‌నుంది. అయితే.. మొత్తంగా ఆరు పిటిష‌న్లు దాఖ‌లు కావ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. దీనిపై సోమ‌వారం దాకా ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంటుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: