కరోనాను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ఆయన నిర్ణయాలను కొనియాడారు.  దేశ వ్యాప్తంగా గత నెల 24 న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కరోనాని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలోమ కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని పెంచుతూ ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని చెబుతున్నారు.  

 

జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కొనియాడుతున్నారని ఎమ్మెల్యే రోజా చెప్పారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5.3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కలిపి 16 కోట్ల మాస్కుల పంపిణీకి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మూడు మాస్కుల చొప్పున అందుకుంటారు  అని రోజా తెలిపారు. 

 

ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ సముచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం కరోనా ప్రభావం ఉండటం వల్ల అక్కడ ఆక్షేపణలు ఉన్నాయని.. అక్కడి వారు లాక్ డౌన్ తప్పకుండా పాటించాలని కోరారు.  బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని.. పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధించింది. ఏపీలో ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: