తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్‌ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ జ‌మాత్ ఉదంతంతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా ప‌రిస్థితి మారిపోయిన విష‌యం తెలిసిందే. మ‌ర్క‌జ్‌కు వెళ్లిన వారిలో అత్య‌ధికుల‌కు క‌రోనా వైర‌స్ సోక‌డం క‌ల‌క‌లం రేపింది. ఇక మ‌ర్క‌జ్‌కు తెలంగాణ నుంచి సుమారు 1100మందికిపైగా వెళ్లి వ‌చ్చార‌ని అధికార వ‌ర్గాలే వెల్ల‌డించాయి. ఇక ఇందులో అనేక మందికి క‌రోనా సోకింది. సుమారు ఏడుగురు మర‌ణించారు. అయితే.. తాజాగా.. మ‌ర్క‌జ్ ఘ‌ట‌న త‌ర‌హాలోనే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

 

ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన జాతీయ మదర్సా సమ్మేళనానికి ఇద్దరు తెలంగాణవాసులు వెళ్లొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన‌ వారిద్దరికీ కరోనా రావడంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్లి వచ్చిన వారందరినీ గాలించే పనిలో పడ్డారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు కేసులు నమోదైన విష‌యం తెలిసిందే. అయితే.. అయితే.. దేవ్‌బంద్‌ మదర్సా కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్రం నుంచి 100 మంది లోపు పాల్గొన్నట్లు స‌మ‌చారం. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే కొంతమందిని గుర్తించగా, మిగతా వారి ఆచూకీని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.ఈ దేవ్‌బంద్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: