లాక్‌డౌన్‌ కారణంగా కేంద్ర మంత్రులంతా అధికార కార్యకలాపాలకు దూరమ‌య్యారు. తాజాగా సోమ‌వారం కేంద్ర మంత్రులు, జాయింట్ సెక్రటరీలు, ఉ న్నతస్థాయి అధికారులు తిరిగి విధుల్లో చేరారు. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, డీవీ సదానంద గౌడ, అర్జున్ ముండా, కిరణ్ రిజిజు తమ విధుల్లో చే రి.. ఉన్నతస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 

 

అయితే కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే తిరిగి విధుల్లో చేరారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇతర సిబ్బంది కార్యాలయాలకు రాలేక పోయారని.. మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘ఉన్నతాధికారులు, కొందరు సిబ్బంది మాత్రమే ఈ రోజు నుంచి విధుల్లో చేరుతున్నారు. కోవిడ్-19 నిబంధ నలను మేం ఖ‌చ్చింతగా పాటిస్తాం’  అని ఆయన పేర్కొన్నారు.  విధుల్లో చేరిన మంత్రులు కార్యాలయాల్లోకి వెళ్లే ముందు వాళ్లకి టెంపరేచర్ గన్లతో ప రీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత శానిటైజేషన్ చేసి కార్యాలయాల్లోకి అనుమతించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: