తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెగిరిపోతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయో ఆ ప్రాంతాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.  ఒక్క మెడికల్ షాపులు తప్పించి.. ఏ దుకాణాలు మధ్యాహ్నం ఒంటి గంట దాటిటే తెరిచి ఉంచకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు తీసుకోవాలను కువే వారే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట‌ మాత్రమే బయటికి వెళ్లాలని సూచించారు.

 

లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొంత మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.  అయితే వ్యాపార సముదాయాల్లో ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి.. కానీ కొంత మంది మాత్రం గుంపులు గుంపులుగా ఉంటున్నారని పోలీసుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు.  పోలీసులు వెళ్లిన సమయంలో సామాజిక దూరం పాటిస్తున్నారని.. తర్వాత షరా మామూలుగా ఉంటున్నారని.. ఇలా చేయడం తప్పని అన్నారు.

 

నిజామాబాద్‌ నగర పాలక సంస్థతోపాటు బోధన్‌, భీమ్‌గల్‌ పురపాలక సంఘాలు, ఆర్మూర్‌, మాక్లూర్‌ మండల కేంద్రం, మోస్రా, రెంజల్‌ మండలం కందకుర్తి ప్రాంతాల్లో ఆదేశాలు తప్పని సరిగా పాటించాలని, లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.  అయితే మిగతా ప్రాంతాల్లోని దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వరకు తెరిచి ఉంచవచ్చని ఆయన తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: