యూరప్ దేశాలైన ఇటలీ , ఫ్రాన్స్ , స్పెయిన్ మరియు బ్రిటన్ లు కరోనాను ఎదుర్కోవడంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ యూరప్ కి  చెందిన జర్మనీ మాత్రం కరోనాను చాల సమర్దవంతం గా నియంత్రిస్తోంది. ఇప్పుడు జర్మనీ పై ప్రపంచ దేశాల కన్ను పడింది ప్రపంచ దేశాలు కరోనా కట్టడి చేయలేక విస్తుపోతుంటే జర్మనీ ఎలాదీనిని నియంత్రిస్తోంది అన్న సందిగ్ధం ఏర్పడింది . ఇటలీ, బ్రిటన్‌లలో మరణాల రేటు 12 శాతం ఉండగా, జర్మనీలో కేవలం రెండు శాతం మాత్రమే ఉండడం విశేషం. దీంతో కరోనా కట్టడికి జర్మనీ అనుసరించిన విధానం మిగిలిన దేశాలకు దిక్సూచిగా మారింది.ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే కరోనాను త్వరిత గతిన కరోనా పరీక్షలను వేగవంతం చేసి. కరోనా బాధితులకు త్వరిత గతిన వైద్యం అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతోంది . తద్వారా మరణాల రేటు ను తగ్గించ గలిగింది. 

మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే కరోనా నిర్ధారణ చాల వేగవంతంగా చేస్తారట. వారం లో 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగల సామర్ధ్యం జర్మనీ కి సొంతం. అందులోను కరోనా భారిన పడిన వృద్దుల రేటు మిగతా యూరప్ దేశాలతో పోలిస్తే కేవలం 20 శాతం మాత్రమే ఈ రేటు మిగతా యూరప్ దేశాలలో 50 శాతం గా ఉంది . అయితే జర్మనీలో అధిక శాతం వృద్దులు ఉన్నప్పటికీ వేగవంతమైన నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన వైద్య సహాయం ద్వారా వారు త్వరగా కోలుకుంటున్నారు. అయితే జర్మనీలో ప్రతి లక్షమందికి 34 వెంటిలేటర్లు ఉన్నాయి. అదే ఇటలీలో కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి. ఇక అక్యూట్‌ కేర్‌ బెడ్‌ల విషయానికి వస్తే, జర్మనీలో ప్రతి లక్షమందికి 621 బెడ్‌లు ఉన్నాయి. ఇటలీ, బ్రిటన్‌తో పోలిస్తే ఇది రెట్టిం పు కంటే అధికం.

మరింత సమాచారం తెలుసుకోండి: