దేశంలో లాక్ డౌన్ విధిస్తున్న వేళ బయటి దేశాలకు మరియు పక్కరాష్ట్రాలకు వెళ్ళినవారు చేసేది ఏమిలేక  వాళ్ళు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ అమలు కారణంగా హైదరాబాద్ కి చెందిన భక్తులు కాశి కి వెళ్లి కాశీలోనే ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంగా ఉండడానికి నివాసం మరియు తిండికోసం ఇబ్బంది పడుతున్న  కాశి కి వెళ్లిన యాత్రికులను యూపీ ప్రభుత్వం గుర్తించి తమ సొంత చొరవతో వారిని హైదరాబాద్ కి చేర్చనుంది.

 

కాశి యాత్రికులను హైదరాబాద్ పంపే ముందు వారికీ పూర్తి స్థాయిలో కరోనా రక్త పరీక్షలు చేసిన తరువాతే హైదరాబాద్ పంపిస్తామని యూపీ ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా యూపీ ప్రత్యేక చొరవతో  వారిని హైదరాబాద్ చేర్చడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటుకూడా చేయనుంది. వారికీ సహాయం చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం యూపీ ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలియజేసింది 

మరింత సమాచారం తెలుసుకోండి: