ఇండియాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం రోజురోజుకూ కొత్త ప్రాంతాల‌కు విస్త‌రిస్తోంది. దీంతొ దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 932 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే అత్యంత దారుణ‌మైన విష‌యం ఏమిటంటే ఒక్క‌రోజే 50మంది క‌రోనాకు బ‌లైయ్యారు. దీంతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 324కు చేరుకుంది. ఇక సుమారు 980మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 8048యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే.. 1985 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండ‌గా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ (1176), తమిళనాడు (1075) ఉన్నాయి.

 

కాగా, ఏప్రిల్ 14తో దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గడువు ముగుస్తోంది. దీంతో రేపు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.  లాక్‌డౌన్ పొడిగింపు కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఇదిలా ఉండ‌గా.. కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఇప్ప‌టికే ఏడు రాష్ట్రాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం కోసం దేశ‌ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: