కెసిఆర్ తొలిసారిగా మాస్క్ ధరించారు అవును ఇది వినడానికి కొంత ఆశ్చర్యానికి గురిచేసినా ఇది ముమ్మాటికీ నిజమే. సోమవారం అయన మాస్క్ ధరించి కనిపించారు. లాక్ డౌన్ మొదలై ఇప్పటివరకు నెలరోజులు కావస్తున్నా ఆయన ఇప్పటివరకు మాస్క్ ధరించలేదు .మర్చి ఒకటో తారీఖున హైదేరాబద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడికి కరోనా పాజిటివ్ వచ్చింది అప్పటినుండి అందరు సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ వచ్చారు .సీఎం కెసిఆర్ మాత్రం ఏ ప్రెస్ మీట్ పెట్టిన సోషల్ డిస్టెన్స్ పాటించారు తప్ప మాస్క్ ధరించలేదు.

 

ఆఖరికి మోడీగారితో వీడియో కాన్ఫరెన్స్ లో అందరూ సీఎంలు మాస్క్ లు ధరించారు కానీ సీఎం కెసిఆర్  మాత్రం మాస్క్ ధరించలేదు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాస్క్ ధరించారు సీఎం కేసీఆర్.ఇదిలా ఉండగా ప్రగతి భవన్ లో ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

 

ఇకపై మంత్రుల సమావేశంలో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించనున్నారు . సమావేశంలో కుర్చీ కి కుర్చీకి మధ్య గ్యాప్ పెంచనున్నారు . అదేవిధంగా ప్రెస్ మీట్ లో కూడా విలేఖరికి విలేఖరికి మధ్య దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇకపై ప్రగతి భవన్ లోకి వచ్చే వారందరూ సబ్బుతో చేతులు మరియు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత శానిటైజర్ అప్లై చేసుకొని మాత్రమే భవన్ లోకి అడుగుపెట్టవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: