ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ప్ర‌భావం పెరుగుతూనే ఉంది. సోమవారం నాడు మరో 19 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 439 కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇందులో 847 కేసుల్లో నెగెటివ్‌ రాగా 19 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో 11 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే నమోదు కావడం గ‌మ‌నార్హం. దీంతో ఆ జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య 93కి చేరింది.

 

ఇక‌ నెల్లూరులో 4, చిత్తూరులో 2, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8755 శాంపిల్స్‌ పరిశీలించగా 8,316 ​కేసుల్లో నెగెటివ్‌ వచ్చింది. 439 కేసులు క‌రోనా పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్‌-19 బారినపడి 12 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఏడుగురు  మరణించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న  కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 420గా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: