భారత్‌లో క‌రోనా వైర‌స్ రెచ్చిపోతోంది. ప్ర‌తీ రోజు కొత్త‌కొత్త ప్రాంతాల‌కు విస్త‌రిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సంఖ్య ఏకంగా 11వేల‌కు చేరువ‌లో ఉంది. కోవిడ్ -19 కేసుల సంఖ్య 10,453కు చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 358కు చేరుకుంది. ఇక సుమారు 980మందికిపైగా క‌రోనా నుంచి కోలుకున్నారు. 8048పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే.. దేశ వ్యాప్తంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి.

 

1985 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండ‌గా, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ (1176), తమిళనాడు (1075) ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు ఈరోజుతో ముగుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం 10గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల‌తో లాక్‌డౌన్‌ను పొడిగించ‌డానికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల వారీగా లాక్‌డౌన్ విష‌యంలో స‌డ‌లింపులు ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌లంద‌రూ ఆయ‌న ప్ర‌సంగం కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: