క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 70 ర‌కాల వ్యాక్సిన్లు త‌యారీలో ఉన్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే మూడు వ్యాక్సిన్లు మ‌నుషుల‌పై ప్ర‌యోగించిన‌ట్లు పేర్కొంది. చైనా, అమెరికా, హాంకాంగ్ కు చెందిన సంస్థ‌లు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగించి, చూశాయ‌ని డ‌బ్య్లూహెచ్‌వో తెలిపింది. అవి వివిధ ద‌శల్లో ఉన్నాయ‌ని , అందుబాటులోకి వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది.

 

క‌రోనా మొద‌లైన మ‌రుక్ష‌ణం నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఔష‌ధ త‌యారీ కంపెనీలు వ్యాక్సిన్ కోసం ప‌రుగు పందెం మొద‌లెట్టాయి. హాంకాంగ్ కు చెందిన క్యాన్‌సినో బ‌యోలాజిక్స్ ఇంక్‌, బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీ సంస్ధ‌లు ఈ ప్ర‌యోగాల్లో ముందున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ కంపెనీలు త‌యారుచేసిన వ్యాక్సిన్లు రెండో ద‌శ‌లో ఉన్నాయి. మొత్తంమీద వ్యాక్సిన్ల‌ను త‌యారుచేయ‌డంలో అనేక అంత‌ర్జాతీయ ఔష‌ధాల కంపెనీలు చాలా వేగంగా ప‌నిచేస్తున్నాయి. 

 

సాధార‌ణంగా వ్యాక్సిన్ల మీద ప‌రిశోధ‌న‌లు చేసి, వాటిని త‌యారుచేసి, ప్రయోగాలు చేసి, అవ‌న్నీ స‌త్ఫ‌లితాలిచ్చాక‌, సాధార‌ణ ప్ర‌జానీకానికి వినియోగంలోకి తేవ‌డానికి స‌గ‌టున‌ ప‌దేళ్ల నుంచి ప‌దిహేనేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. అయితే క‌రోనా ఒక‌వంక ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తూ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది నాటికి మార్కెట్‌లోకి తేవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు డ్ర‌గ్ పరిశ్ర‌మ వ‌ర్గాలు తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: