భార‌త్ పార్ల‌మెంట్ నిర్మాణ ప్రాజెక్టు మరింత వేగం పుంజుకోనుంది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ఈ ప్రాజెక్టు టెండ‌రింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం నూత‌న పార్ల‌మెంట్ డిజిట‌ల్ ప‌నులు సాగుతున్నాయి. ఆగష్టు 2022 నాటికి కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలన్న ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం ఉంది. లాక్‌డౌన్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ టెండర్ ఖ‌రారు అవుతుంద‌ని కొత్త పార్ల‌మెంట్ వాస్తుశిల్పులు చెబుతున్నారు. త్రిభుజాకారంలో పార్లమెంటు హౌస్‌కు సమీపంలో నూత‌న పార్ల‌మెంట్‌ను నిర్మించ‌నున్నారు.

 

2022 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నూత‌న పార్ల‌మెంట్‌ భవనం సిద్ధంగా ఉంటుందని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణాన్ని ఆపివేయాల‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశం ఆర్థికంగా చాలా న‌ష్టాల్లో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం చేప‌ట్ట‌డం మంచిది కాద‌ని పేర్కొన్నారు. కాగా, 9.5 ఎక‌రాల స్థ‌లంలో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టు వ్యయం 776 కోట్ల నుంచి 22 922 కోట్లకు పెరగ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: