క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ముందు నుంచి పక్కా ప్లానింగ్‌తో ఉన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే వారం రోజులు దేశంలో క‌ఠిన‌మైన ప‌రిస్థితులు ఉంటాయ‌ని... అంటే ఏప్రిల్ 20వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ చాలా కఠినంగా అమ‌లు చేసి.. ఆ త‌ర్వాత ప‌రిస్థితి స‌మీక్షించి క్ర‌మ‌క్ర‌మంగా క్ర‌మ‌క్ర‌మంగా హాట్‌స్పాట్‌ల సంఖ్య త‌గ్గితే ఆంక్ష‌లు స‌డ‌లిస్తామ‌ని మోదీ చెప్పారు. 

 

ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పాటు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. దీని మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా రేపు వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. ఇక ఏప్రిల్ 20 త‌ర్వాత ఒక్క క‌రోనా కేసు పెరిగినా కూడా అన్ని మిన‌హాయింంపులు తీసేస్తామ‌ని కూడా చెప్పారు. అందుకే మనమందరం కరోనా కట్టడికి జాగ్రత్తతో ఉండాలని సూచించారు. 

 

వ్య‌వ‌సాయ రంగానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని చెప్పిన మోడీ లాక్‌డౌన్ ఇక మార్గ‌ద‌ర్శ‌కాల విష‌యంలో మాత్రం స‌స్పెన్స్లో పెట్టారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రేపు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో కాస్త స‌స్పెన్స్ అయితే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉంది. ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు రేపు రిలీజ్ అవుతాయి అన్న సందేహాలు ప్ర‌తి ఒక్క‌రికి ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: