ఆర్థికం క‌న్నా.. దేశ‌ప్ర‌జ‌ల ప్రాణాలే అత్యంత ముఖ్య‌మంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ మే 3వ తేదీ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించారు. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉంద‌ని, ఇది భార‌త ప్ర‌జ‌ల విజ‌య‌మ‌ని అన్నారు. వ‌చ్చే 19రోజులుకూడా ప్ర‌జులు ఇదే స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని పిలుపునిచ్చారు. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..  నిన్న‌, మొన్న ప‌లు రాష్ట్రాలు కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండానే ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఇందులో ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు అరుణాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి ఉన్నాయి. దీంతో ప్ర‌ధాని మోడీ కూడా ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కే లాక్‌డౌన్‌ను పొడిగిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

 

కానీ.. అనూహ్యంగా మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించారు. రాష్ట్రాలు, కేంద్రం ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ పొడిగింపు తేదీల్లో ఎందుకీ తేడా అన్న‌దానిపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. రాష్ట్రాలు పొడిగించిన ఏప్రిల్ 30వర‌కు గాకుండా.. మే 3వ తేదీ వ‌ర‌కు మోడీ ఎందుకు పొడిగించారు..? ఇందులో ఏమైనా ప్ర‌త్యేక‌త ఉందా..? అన్న ప్ర‌శ్న‌లు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. ఇందులో ఏదో మోడీ మార్క్ త‌ప్ప‌కుండా ఉండి ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక్క‌డ మ‌రో టాక్‌ కూడా వినిపిస్తోంది. రాష్ట్రాలు కేవ‌లం నెలాఖ‌రును దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌ను పొడిగిస్తే.. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఆధారంగా మే 3వ మోడీ లాక్‌డౌన్‌ను పొడిగించి ఉంటార‌ని అంటున్నారు. ఒక‌వేళ‌..ప్ర‌తిసారి త‌న మార్క్‌ను చూపించే మోడీ.. ఈసారి కూడా మే 3వ తేదీకి ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండి ఉంటుంద‌ని, అందుకే ఆ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించి ఉంటార‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: