ఏపీలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. కేవ‌లం కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే కొత్త‌గా 34 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే 16 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో రాష్ట్రంలో  మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య473కు చేరుకుంది. క‌డ‌ప‌లో 31, చిత్తూరులో 23, విశాఖ‌లో 20, క‌డ‌ప‌లో 31, అనంత‌పురంలో 17, గుంటూరులో 109కేసులు, క‌ర్నూలులో 97, కృష్ణాలో 44, ప్ర‌కాశంలో 42, నెల్లూరులో 56, ప‌శ్చిమ గోదావ‌రిలో 23 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత క‌ట్టుదిట్టంగా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా ఇక నుంచి లాక్‌డౌన్ నిబంధ‌న‌లను మ‌రింత క‌ఠిన‌త‌రంగా అమ‌లు చేసేందుకు అధికారుల సిద్ధ‌మ‌వుతున్నారు. ముఖ్యంగా రెడ్ జోన్ల‌లో అధికారులు అల‌ర్ట్‌గా ఉంటున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించిన రోజునే ఏపీలో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌లు సామ‌జిక దూరం పాటించ‌కుండా ఇష్టారీతిన బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: