నోవెల్ క‌రోనా వైర‌స్‌ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.  లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యానికి అన్నివ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా స్పందించారు. లాక్‌డౌన్ పొడిగింపున‌కు సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఇచ్చారు. లాక్‌డౌన్ వ‌ల్ల క‌లిగిన మేలును తాను కొట్టిపారేయ‌లేన‌ని అన్నారు.  అయితే లాక్‌డౌన్ వ‌ల్ల జీవ‌నోపాధి కోల్పోయిన వారి కోసం ప్ర‌ధాని మోడీ మ‌రికొన్ని రిలీఫ్ ప్యాకేజీలు ప్ర‌క‌టించి ఉండాల్సింద‌ని ఎంపీ శ‌శిథ‌రూర్‌ త‌న ట్విట్ట‌ర్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు.

 

కానీ.. జ‌న్‌ధ‌న్ అకౌంట్ల చెల్లింపుల గురించి మోడీ మాట్లాడ‌లేద‌న్నారు. ఆయా రాష్ట్రాల‌కు రావాల్సిన జీఎస్టీ గురించి కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌స్తావ‌న చేస్తే బాగుండేద‌న్నారు. అలాగే.. ఢిల్లీలో 51 మంది హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ సోకిన‌ట్లు తేల‌డం ప‌ట్ల ఎంపీ శ‌శి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. ఆ న‌ర్సులంద‌రికీ ర‌క్ష‌ణ‌గా పీపీఈ ప‌రిక‌రాలు ఏర్పాటు చేయాల‌న్నారు. రోగుల ప్రాణాలు కాపాడుతున్న న‌ర్సుల జీవితాల‌ను ప్ర‌భుత్వం ర‌క్షించాల‌ని ఆయ‌న కోరారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: