కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసింది. మంగళవారం జాతిని ఉద్ధేశించి ప్రసంగించిన ఆయన.. లాక్‌డౌన్ ముగిసే వరకూ ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు పాటించాలని.. కరోనాను అరికట్టేందుకు ఇది ఒకటే మన ముందు ఉన్న మార్గం అని అన్నారు.

 

అయితే ప్రధాని ప్రసంగంలో కొత్తగా చెప్పిన అంశం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు.  లాక్‌డౌన్ పొడిగింపును సమర్థిస్తున్నామని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం పేదల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని మరోసారి రుజువైందని అ న్నారు. ‘ప్రధానమంత్రికి మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాం. లాక్‌డౌన్ పొడిగింపు అనివార్యం అనే విషయం మాకు అర్థమైంది. ఆ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. 

 

కానీ, లాక్‌డౌన్‌ని పక్కన పెడితే.. ప్రధాని నూతన సంవత్సర సందేశంలో ‘కొత్త’ అంశం ఏముంది. పేదల జీవనం, వాళ్ల మనుగడకి ప్రాధాన్యత లేదని మరోసారి రుజువైంది.  ఈ 21 రోజులే కాకుండా మరో 19 రోజులు.. పేదలు తమ ఆహారం కోసం అభ్యర్థించడంతో పాటు.. తమని తాము రక్షించుకోవాలి. డబ్బులు ఉన్నాయి.. ఆహారం ఉంది. కానీ, ఆ రెండిటిని ప్రభుత్వం మాత్రం విడుదల చేయదు’’ అంటూ చిదంబరం పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: