దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని మే 3 వరకు పొడగించాల్సి వస్తున్నందుకు బాధగా ఉన్నా.. ప్రజల ఆరోగ్యం ప్రధాన అంశం కనుక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఇదే సమయంలో ఆయన కొన్ని ఊరట వ్యాఖ్యలూ చేశారు. ప్రస్తుతం రెడ్ జోన్, హాట్ స్పాట్ లు అమలవుతున్న ప్రాంతాల్లో 20వ తేదీ వరకూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.   కాగా, రాష్ట్రాల సీఎంల మాటకు విలువనిచ్చిన నరేంద్ర మోదీ, లాక్ డౌన్ ను పొడిగిస్తూనే, 20వ తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే, లాక్ డౌన్ నిబంధనల సడలింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు.తాజాగా మోదీ ప్రసంగం పై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

 

- ఎవరి డ్యూటీని వారు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మేము నిబంధనలన్నీ పాటిస్తాం. మాస్క్ లు ధరిస్తాం. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాం. ఆరోగ్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటాం.  ఎంఎస్ఎంఈలకు సహకారాన్ని అందించాలి" అని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ  వ్యాఖ్యానించారు.

 

- లాక్ డౌన్ పొడిగింపు కఠిన నిర్ణయమేనని.. అయితే ఇప్పుడు ప్రధాని తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైనదే అన్నారు.  ఇక, ఈ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత జాతి ప్రజలందరిపైనా ఉంది. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలంతా పాటించాలి. సురక్షితంగా ఉండాలి అంటూ మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయంకా వ్యాఖ్యానించారు.

 

- మే 3 వరకు లాక్ డౌన్ పొడగించారు.. కానీ ఇదే సమయంలో వేల మంది పేదలు, నిరాశ్రయుల పరిస్థితి ఏంటి? దేశంలో కొన్ని దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి... కొన్ని చోట్ల వీధి కుక్కలతో కలిసి రోడ్డుపై పడ్డ పాలను ఎత్తుకుంటున్న కడు పేదల దృశ్యాలు కనిపించ లేదా?" అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.  

 

- ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్ పొడిగింపునకు మద్దతిస్తున్నాను. అయితే ఇదే సమయంలో పేద ప్రజల గురించి సరైన నిర్ణయం తీసుకోవాలని.. ప్రజల అవసరాలను తీర్చేందుకు కూడా కొన్ని నిర్ణయాలు ప్రకటించివుంటే బాగుండేది. ఎంఎన్ఆర్ఈజీఏ చెల్లింపులు, జన్ ధన్ ఖాతాలు, రాష్ట్రాలకు జీఎస్టీ చెల్లింపులు తదితరాలను మరచిపోయారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: