ప్రపంచంలోకి ఏ టైమ్ లో అడుగు పెట్టిందో కానీ కరోనా మహమ్మారి మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  మనిషి ఆరోగ్యంతోనే కాదు.. నిట్టనిలువునా చంపేస్తుంది.  ఇప్పటికే అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో వేల సంఖ్యలో మరణాలు సంబవించాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య లక్ష దాటిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. మన దేశంలో గడచిన 24 గంటల్లో 1,211 కొవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో, మొత్తం కేసుల సంఖ్య ఇండియాలో 10 వేలను దాటేసింది. దేశంలో 10,363 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి.

 

ఇదే సమయంలో ఇప్పటివరకూ 339 మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 1,035 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పదవతరగతి విద్యార్థుల పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు.  లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తి వేసిన తర్వాత పదవతరగతి విద్యార్థులకు కొన్ని రోజులు ప్రిపరేషన్ కు సమయం కేటాయించి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

 

ప్రస్తుతం దూరదర్శన్ సప్తగిరి చానల్ లో 10వ తరగతి విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్ లైన్ బోధన ఉంటుందని వివరించారు.  ఇదిలా ఉంటే ఉదయం ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: