క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప‌లు దేశాలు లాక్‌డౌన్‌ను పొడిస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌య‌మే భార‌త్‌లో మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా.. మ‌న ప‌క్క‌నే ఉన్న దేశం నెపాల్ కూడా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి కూడా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 27 వ‌ర‌కు పొడిగించింది. నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి నేతృత్వంలో జ‌రిగిన క్యాబినెట్‌ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

 

దేశంలో క‌రోనా వైర‌స్‌ క‌ట్ట‌డిపై అధ్య‌య‌నం కోసం ఇటీవ‌ల నేపాల్ స‌ర్కారు హైలెవ‌ల్ క‌మిటీని ఏర్పాటు చేసింది. అయితే... ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించ‌డ‌మే స‌రైన మార్గ‌మ‌ని ఆ క‌మిటీ సూచించింది. ఈ మేర‌కు నేపాల్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాలు పొడిగించింది. నిజానికి.. నేపాల్‌లో మార్చి 24 నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. బుధ‌వారం అర్థ‌రాత్రితో 21 రోజుల లాక్‌డౌన్ యుగియ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కాగా, నేపాల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 16 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: