ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త చెప్పారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులోనూ పేద‌ల కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా పేద‌ల‌కు రేష‌న్ స‌రుకులు అందించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి కార్డుదారులంద‌రికీ బియ్యంతోపాటు వెయ్యి రూపాయలు పంపిణీ చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 

కార్డుదారుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ‌కుండా.. ఒకో రేష‌న్ దుకాణాన్ని రెండు మూడు షాపులుగా విభజించి, స‌రుకులు అందిస్తామ‌ని తెలిపారు. ఇందుకోసం స్లిప్పులు కూడా ఇస్తామ‌ని, వాటి ప్ర‌కారంగానే కార్డుదారులు షాపుల‌కు రావాల‌ని సూచించారు. అంతేగాకుండా.. రైతులు పండించిన పంట‌ల‌కు త‌ప్ప‌కుండా మ‌ద్ద‌తు ధ‌ర అందేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఎక్క‌డ కూడా రైతులు ఇబ్బందులు క‌లిగించ‌వ‌ద్ద‌ని, అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: