కరోనా తో దేశంలో అల్లకల్లోలం అవుతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల ప్రజలు ఆయా రాష్ట్రాలలో చిక్కుకు పోయారు. నిన్న ముంబై లో వలస కూలీల సంఘటన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నిన్న మోడీ  ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం లో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు తెలియజేసారు. దీనితో కంగారుపడిన వలస కూలీలు తమతమ రాష్ట్రాలకు వెళ్లాలని అనుకున్నారు. ఇదే సమయంలో దేశంలో మళ్లీ రైల్లు ప్రారంభ మౌతున్నాయన్న తప్పుడు ప్రచారం జరగడంతో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు  ప్రజలంతా చేరుకున్నారు .

 

వారిని  వారించడానికి పోలీసులు లాఠీ కి పని చెప్పాల్సి వచ్చింది. ఇది తెలుసుకున్న ప్రభుత్వం కొన్ని నిబంధనలు చేసింది. అదేంటంటే ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని అనుకుంటే తప్పని సరిగా సంభందిత SP ద్వారా DIG కి దరఖాస్తు చేసుకోవాలని DIG గౌతమ్ సవాంగ్ తెలిపారు .దరఖాస్తులను పరిశీలించిన తరువాత సంబందితః రాష్ట్రాలతో చర్చించి సంబంధిత దాఖాస్తు దారులకు అనుమతి ఇస్తామని చెప్పారు . ఎవరైనా  రాష్ట్రంలో ని ఇతర జిల్లాలకు వెళ్ళవలసి వస్తే SP కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలనీ తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: