ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల‌ సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. అనంత‌పురం జిల్లాలో  కోవిడ్‌-19 చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. దీంతో అధికారులు అ ప్ర‌మ‌త్తం అయ్యారు. క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు క‌ఠిన‌, కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా  కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ల నుంచి శాంపిల్స్‌ తీసుకునే వైద్యాధికారుల‌కు జిల్లా అధికార యంత్రాంగం త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. 

 

కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ల నుంచి శాంపిల్స్‌ తీసుకునే వైద్యాధికారుల‌కు  ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని జేసీ ఎస్ .డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వైద్య నిపుణులు, సిబ్బంది ఆధార్‌ నంబర్‌ను సీఐఎఫ్  (కేస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫారం)లో నమోదు చేయాలన్నారు. జేసీ మంగళవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఐఎఫ్‌లో శాంపిల్స్‌ వివరాలను పూరించే సమయంలో ఈఎన్‌టీ, డెం టిస్ట్‌ల ఆధార్‌ నంబర్‌ నమోదు చేయకపోతే సంబంధిత పోర్టల్‌లో శాంపిల్‌ వివరాలు ఎంటర్‌చేయడానికి వీలుకాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: