వేస‌విలో వేల సంఖ్య వివాహాలు జ‌రుగుతాయి. కానీ.. ఈ వేస‌విలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో కొన్నివేల సంఖ్య‌లో వివాహాలకు అడ్డుక‌ట్ట‌ప‌డింది. నిజానికి.. ఏప్రిల్ 14వ త‌ర్వాత లాక్‌డౌన్ ఎత్తేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతూ ఉండ‌డంతో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడించిన విష‌యం తెలిసిందే. దీంతో వేస‌విలో పెళ్లీల సీజ‌న్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దాదాపుగా అన్ని పెళ్లీలు ఆగిపోయిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఏప్రిల్‌  15వ తేదీ ముహూర్తం కోసం  మార్చి రెండో వారంలోనే  అమెరికా నుంచి పెద్ద‌సంఖ్య‌లో వ‌ధూవ‌రులు గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు.

 

కానీ..లాక్‌డౌన్ కార‌ణంగా వివాహాలు వాయిదా ప‌డ్డాయి. నిజానికి..గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో గతేడాది  ఏప్రిల్, మే నెలల్లో సుమారు 12,500 వివాహాలు జరిగినట్లు అంచనా. ఈసారి ఇదే కాలంలో 15000 లకు పైగా పెళ్ళిళ్లు జరిగేందుకు అవకాశం ఉంద‌ని అనుకున్నారు. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా అన్నీ వాయిదా పడినట్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పురోహితులు చెబుతున్నారు. మరోవైపు  గ్రేటర్‌ పరిధిలోని సుమారు 5 వేలకు పైగా చిన్నవి. పెద్దవి ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెళ్లి మండపాలు క‌ళ‌త‌ప్పాయ‌ని చెబుతున్నారు. కేటరింగ్‌ సర్వీసుల్లో, బ్యాండ్‌ మేళ్లాల్లో పని చేసే సిబ్బంది, కళాకారులు ఉపాధిని కోల్పోయారు.సుమారు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: