ఏపీలో ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైస్కూల్ విద్య లో తెలుగు మీడియం తో... పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో అది సమర్థవంతంగా అమలు కాలేదు. దీంతో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆంగ్ల విద్య తప్పనిసరి చేస్తూ తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వానికి ఇదే అంశంపై హైకోర్టులో తగిలింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. 

 

తమ పిల్లలు చదివే మీడియంను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు అని... ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే బ్యాక్లాగ్ మిగిలిపోతాయి పిటిషనర్ తరఫు లాయరు వాదించారు. ఏదేమైనా ప్ర‌స్తుతం హైకోర్టు జ‌గ‌న్ ప్ర‌భుత్వం జారీ చేసిన రెండు జీవోలు 81, 85కొట్టి వేయ‌డంతో ఈ విష‌యంలో తాత్కాలికంగా జ‌గ‌న్ పై బాబు కాస్త విజ‌యం సాధించిన‌ట్టే లెక్క‌. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఇస్తోన్న వ‌రుస షాకుల‌తో కుదేలవుతోన్న బాబోరు, అండ్ టీడీపీకి ఇది కాస్త ఉప‌శ‌మ‌నం లాంటిదే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: