ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న‌దేశంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా దెబ్బ‌తో ప్ర‌జ‌లు విల‌విల్లాడుతున్నారు. కరోనా కేసుల‌కు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డే ప‌రిస్థితి లేదు. ఈ క‌రోనా వార్త‌ల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పేందుకు, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు జ‌ర్న‌లిస్టులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఓ విధంగా వీళ్లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారే చెప్పాలి. మ‌రోవైపు ఈ సంక్షోభం నేప‌థ్యంలో చాలా మంది జ‌ర్న‌లిస్టులు ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి.

 

అయినా ఈ టైంలో వాళ్లు ఓ వైపు బ‌య‌ట చాలా ప్ర‌మాద‌కర పరిస్థితుల్లో ఉద్యోగాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు జ‌ర్న‌లిస్టులు బ‌య‌ట ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలీసుల ఒక్కోసారి విరుచుకుప‌డుతున్నారు. ఈ విష‌యంలో కేసీఆర్ ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్టుల‌ను ఏమీ అన‌వ‌ద్ద‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్టులు అంద‌రికి బూస్ట‌ప్ ఇచ్చే వార్త ఐక్య‌రాజ్య‌స‌మితి చెప్పింది. 

 

ఈ స‌మ‌యంలో జర్నలిస్టులను అత్యవసర సేవల కేటగిరీ కింద పరిగణించాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యునెస్కో డైరెక్టర్‌ గైబెర్గర్‌ ప్రభుత్వాలను కోరారు. ‘‘సమాజంలో ఒక విధమైన భయం నెలకొన్నప్పుడు.. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో తప్పుడు వార్తలు విజృంభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒక్కటే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా.. మీడియా సహకారం తప్పనిసరి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: