బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి, జువెలరీ డిజైనర్ ఫరాఖాన్ అలీ ఇంటి పని మనిషికి కరోనా వైరస్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ఫరాఖాన్ అలీ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసి వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. తమ ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకడంతో ఆమెను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్యులు ఆసుపత్రికి తరలించారు. 

 

‘‘మా ఇంటి పనిమనిషికి కరోనా సోకిందని తేలడంతో అధికారులు అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, అధికారులను ప్రశంసిస్తున్నా’’ అని ఫరాఖాన్ అలీ తెలిపారు. ‘‘అధికారులు కరోనా రోగిని తరలించిన విధానం అద్భతంగా ఉంది. వారు దయ, మానవత్వంతో వ్యవహరించారు’  అని ఫ రాఖాన్ అలీ పేర్కొన్నారు. ఫరా, సుజానే, సిమోన్, నటుడు జాయేద్ ఖాన్ లు ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్, జరీనాల పిల్లలు. ఫరాఖాన్ అలీ డీజే అఖిల్ ను వివాహమాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: