ప్రపంచ వ్యాప్తంగా కరోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇవాళ వ‌ర‌కు  1,26,000 మందికి పైగా వైర‌స్ బారిన ప‌డి మృతి చెందారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,98,138 పాజిటివ్ కేసులు నమోదవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బుధవారం కొత్తగా 278 కేసులు నమోదుకాగా కరోనా వ్యాధితో 8 మంది చనిపోయారు.

 

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మొత్తం కేసుల సంఖ్య 6,13,886 ఉండగా.. 26,047 మంది మృతిచెందారు. స్పెయిన్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. స్పెయిన్ జనజీవనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. స్పెయిన్‌లో మొత్తం 1,74,060 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 18,255 మంది చనిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: