దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నానా రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు.  గత నెల 24 న లాక్ డౌన్ ప్రకించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని.. ఆ తర్వాత ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్  ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారి వల్లే ఎక్కువ కరోనా వ్యాప్తి చెందిందని అంటున్నారు.  అక్కడ నుంచి వచ్చిన వారు వివిధ ప్రార్ధనా మందిరాల్లో పలువురుని కలవడం.. వారికి కరోనా రావడంతో ఈ కేసులు పెరిగిపోయాయని అంటున్నారు. 

 

తాజాగా తెలంగాణలో కరోనా కేసులపై మంత్రి ఈటల రాజేందర్‌ ఓ మ్యాప్‌ పోస్ట్ చేశారు. ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని అందులో తెలిపారు.  కామారెడ్డిలో 8, కోలుకున్న వారి సంఖ్య 3, ములుగులో 2, సిద్ధపేటలో 1, మెదక్‌లో 3, కోలుకున్న వారు 3, జనగాంలో కోలుకున్న వారు 2, మహబూబాబాద్‌లో 1, భద్రాద్రిలో 2, కోలుకున్న వారి సఖ్య 2, హైదరాబాద్‌లో 249 మంది, కోలుకున్న వారి సంఖ్య 58, వికారాబాద్‌లో 29, ఖమ్మంలో 7, నల్లగొండలో 12, సూర్యాపేటలో 23, నాగర్‌కర్నూల్‌లో 2, జోగులాంబలో 18, కోలుకున్న వారు ఒక్కరు ఉన్నారు.

 

ఆదిలాబాద్‌లో 11, అసిఫాబాద్‌లో 3, నిర్మల్‌లో 17, జగిత్యాలలో 2, పెదద్పల్లిలో 2, భూపాలపల్లిలో 3, నిజామాబాద్‌లో 36, కోలుకున్న వారు 15, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1, కామారెడ్డిలో 8, కరీంనగర్‌లో 4, కోలుకున్నవారు 14 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని రకాలుగా కట్టుదిట్టాలు చేస్తున్నామని.. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని మంత్రి ఈటెల అన్నారు.   నిన్న  రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 644 మంది బాధితులున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: