ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.  ఎంత కట్టుదిట్టం చేసినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఓ వైపు లాక్ డౌన్ పాటిస్తున్నా.. ఈ కరోనా మహమ్మారి మాత్రం తన ప్రతాపాన్ని రోజు రోజుకీ మరింత ఎక్కువగా చూపిస్తుంది. తాజాగా కొవిడ్‌-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జగన్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చలు జరిపారు.

 

రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికారి కరోనా వ్యాప్తి అరికట్టడానికి తన వంతు కృషి చేయాలి. ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి కరోనా పై అవగాహన ఏర్పాటు చేసి వారి లో ధైర్యాన్ని నింపాలి అన్నారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో పనిచేద్దామని అధికారులతో జగన్ అన్నారు. నేటి నుండి మళ్లీ రేషన్‌ పంపిణీ చేస్తోన్న నేపథ్యంలో రేషన్‌ షాపులకు అనుబంధంగా కౌంటర్లు పెంపునకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు వేర్వేరు కలర్‌లతో కూడిన కూపన్లు అందజేయాలని, ఏ రోజు, ఏ సమయంలో రేషన్‌ తీసుకోవాలో కూడా ఆ కూపన్లలో సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.

 

అంతే కాదు ఇది ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి.. అందుకోసం రేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా షామియానాల ఏర్పాటుకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు.  ఈ సమావేశంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: