నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ యావత్ తెలుగునేల మొత్తం వినపడుతుంది గత నెల రోజులుగా అయితే మంచిగా కాదులెండి. సీనియర్ ఆఫీసర్ అయిన నిమ్మగడ్డ పార్టీల పక్షపాతిగా వ్యవహరిస్తూ, వ్యవస్థలను కొంతమంది ముంగిట దాసోహం అనిపించారనే లెక్కకు మించినన్ని ఆరోపణలు కొనితెచుకున్నారీయన తన వివాదాస్పద పనులు, వ్యాఖ్యల చేత. అత్యంత వివాద‌స్ప‌దంగా వార్త‌ల్లోకి ఎక్కిన ఈ మాజీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్ ర‌మేష్‌కుమార్‌పై ఇప్పుడు గంభీరమైన మ‌రికొన్ని ఆరోప‌ణ‌లు ముసురుకున్నాయి.

 

నిమ్మగడ్డ హయాంలో, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కార్యాలయంలో... హై కోర్ట్ జడ్జి స్థాయిలో ఉండే ఎన్నికల కమీషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేయబడిందని భయంకరమైన ఆరోపణ అదీ భారతదేశ పార్లమెంట్ మెంబర్ మరియు వైస్సార్సీపీ రాజ్యసభాపతి వి. విజయసాయి రెడ్డి గారు స్వయానా లిఖిత పూర్వకంగా ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ శ్రీ. గౌతమ్ సవాంగ్ గారికే ఫిర్యాదు చేయడం మాత్రం తప్పనిసరిగా చర్చనీయాంశం.  

 


కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి నిమ్మ‌గ‌డ్డ రాసిన లేఖ‌కు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసిన సంద‌ర్భంగా ఉన్న లేఖ‌లో ఉన్న సంతాల‌కు ఏ మాత్రం పొంత‌న లేద‌ని ఆయ‌న డీజీపీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ఫోర్జరీ సంత‌కాలు, క‌ల్పిత డాక్యుమెంట్ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని... ఈ లేఖ‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి... ఐపీ ఆధారంగా లేఖ ఎవ‌రు పంపారో గుర్తించాల‌ని.. ఆ నివేదిక ఆధారాంగా వెంట‌నే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌సాయి రెడ్డి డిమాండ్ చేశారు. 

 

ప్రజాస్వామ్య ప్రత్యక్ష పరిరక్షణ  క్షేత్రాలైన ఎన్నికల కమిషన్ ఆఫీసులో, అందునా సాక్షాత్తు చీఫ్ ఎన్నికల కమీషనర్ సంతకం ఫోర్జరీ... అందునా ఆరోపింపబడినట్లు ఆ ఆఫీసర్ ఇష్ట (కుట్ర) పూర్వకంగానే జరిగిందనే వార్త... దావానలంలా వ్యాపిస్తుంది. ఇలాంటి దుష్ట దుర్మార్గమైన సంఘటన కనుక నిజముగా జరిగిఉంటే, ఇంతకంటే క్షమించరాని నేరము, ఘోరం ఇక ఏదీ ఉండదూ, ఉండబోదు అని ముక్త కంఠముతో ఎలుగెత్తుతున్నారు తెలుగు ప్రజ.

విజ‌య‌సాయి రెడ్డి గారి ఆరోపణను సత్వరితంగా విచారించి, యుద్ధప్రాతిపదికపై నిజాలను వెల్లడించాలని, ఈ ఆరోపణే నిజమై ఈ గర్హనీయమైన, హేయ చర్య (కుట్ర) నిజమే అయితే... ససాక్ష పూర్వకంగా విచారణ జరిపించి ... బుద్ది వచ్చేలా శిక్షలు విధించాలని కోరుకుంటున్నారు. 
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: