ప్రపంచ దేశాలలో అగ్ర రాజ్యమైన అమెరికా కరోనా మరణాలతో పోరాటం చేస్తోంది. నానాటికి పెరుతూగుతూనే ఉన్న కరోనా వైరస్ జనాలను పిట్టల్లా  రాలేట్టు చేస్తోంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో 2129 మంది మరణించారు. ఇప్పటి వరకు అమెరికాలో 26097 మరణాలు సంభవించగా ఒక్క న్యూయార్క్ నగరంలో 10842 మంది కరోనా భారీ న పడ్డారు. కాగా న్యూయార్కులో 203020 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
అమెరికాలో కోలుకుంటున్న వారి దృష్ట్యా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే షట్ డౌన్ నీ ఎత్తి వేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత సంఘటనల దృష్ట్యా ట్రంప్ ఆ నిర్ణయాన్ని మరచిన్నట్టు సమాచారం.

 

అయితే ఇప్పటివరకు అమెరికాలో 614246 కేసులు నమోదు అయ్యాయి. అయితే వైరస్ పోరులో పురోగతి సాధిస్తున్నామని .కరోనా కారణంగా చనిపోయే వారి త్యాగం వృధాగాపోదని. కమ్ముకున్న చీకట్లలోనుంచి వెలుగు రేఖలను చవిచూస్తామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చెశారు. అదేవిధంగా  ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక తలసరి ఐసీయూలు ఉన్నాయని తెలిపారు. అలాగే 16,000 వెంటిలేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.అదేవిదం గా రట్‌గర్స్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా బాధితుని లాలాజల కరోనా టెస్టింగ్ కిట్ ను ఇప్పటికే పరీక్షించామని .దీనినీ  మంగళ వారం రోజు పరీక్షించామని చెప్పారు .దాదాపుగా 10 వేల మందికి పైగా టెస్టులు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ కిట్ ద్వారా రోగి స్వయంగా పరీక్షా చేసుకొనే వెసులు బాటు ఉందని తద్వారా వైద్యులకు ఎటువంటి రిస్క్ ఉండదని తెలిపారు  

మరింత సమాచారం తెలుసుకోండి: