క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో ఆరోగ్య సంస్థ‌కు, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ధ్య వాగ్వాదం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మొద‌టి నుంచీ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లు అయిన చైనాకు మ‌ద్ద‌తుగా నిలుస్తోంద‌ని ప‌లుమార్లు ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైర‌స్ విష‌యంలో చైనా, డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌పంచ దేశాల‌ను ముంద‌స్తుగా హెచ్చ‌రించ‌లేద‌ని ఆయ‌న ప‌లుమార్లు కోపంతో కూడా ఊగిపోయారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ట్రంప్‌కు చుర‌క‌లు బాగానే అంటించింది. ఈ క్ర‌మంలోనే ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధుల కేటాయింపును నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

 

అయితే.. దీనిపై మైక్రోసాఫ్ట్ అధిప‌తి బిల్ గేట్స్ స్పందించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం నెల‌కొన్న స‌మ‌యంలో.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులు నిలిపివేయ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం అని అన్నారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న చేయ‌గానే గేట్స్ ఆ అంశంపై త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. విప‌త్క‌ర స‌మ‌యంలో నిధుల‌ను ఆపేయ‌డం స‌రికాద‌ని అన్నారు. డ‌బ్ల్యూహెచ్‌వో చేప‌డుతున్న చ‌ర్య‌ల వ‌ల్లే కోవిడ్‌19 వ్యాప్తి అదుపులో ఉంద‌ని గేట్స్ అన్నారు. ఈ ద‌శ‌లో ఆ సంస్థ‌ ప‌నిని నిలిపివేస్తే, అప్పుడు మ‌రే సంస్థ కూడా ఆ ప‌నిచేసేందుకు ముందుకు రాదని ట్రంప్‌కు చుర‌క‌లు అంటించారు గేట్స్‌. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌పంచానికి డ‌బ్ల్యూహెచ్‌వో ఎంతో అవ‌స‌ర‌మ‌ని, ఇంత‌క‌న్నా మ‌రో మార్గం లేద‌ని గేట్స్ స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: