ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మెడ్‌టెక్‌ ఉత్ప‌త్తులు ప్రారంభించింది. పెద్ద ఎత్తున‌ పీపీఈలు, మాస్క్‌లు ఉత్ప‌త్తి అవుతున్నాయి. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే రానున్న 15రోజుల్లో 60మిలియ‌న్లు మాస్క్‌లు, మూడు మిలియ‌న్ల పీపీఈలు త‌యారు అవుతున్నాయి. త్వ‌ర‌లోనే ఇవి మార్కట్లోకి రానున్నాయి. త్వ‌ర‌లోనే మాస్క్‌లు, పీపీఈల ఉత్ప‌త్తికి ఏపీ హ‌బ్‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం వీటిని ఏపీలోని రాజోలు, తెనాలి, వైజాగ్‌లో వీటిని భారీ సంఖ్య‌లో త‌యారవుతున్నాయి.

 

క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచానికి ఇవి ఎంతో అత్య‌వ‌స‌రం. దీంతో ఏపీలో ఉత్ప‌త్తి అయ్యే మాస్క్‌లు, పీపీఈల‌కు మంచి డిమాండ్ ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేగాకుండా.. ఏపీలో భారీగా ఉపాధి అవ‌కాశాలు ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇది నిజంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచి ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. నిజానికి ఇండియా కూడా దేశానికి స‌రిపోను అంటే 25శాతం ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డే ఉంచి, మిగ‌తా 75శాతం ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేసుకోవ‌చ్చున‌ని చెప్పింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: