నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వహారం మ‌రో మ‌లుపు తిరిగింది. రోజురోజుకూ ఆయ‌న తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా.. ఆయ‌న‌పై ప్ర‌భుత్వ డాక్యుమెంట్ల ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఏకంగా రాష్ట్ర డీజీపీ గౌత‌మ్‌స‌వాంగ్‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి నిమ్మ‌గ‌డ్డ రాసిన లేఖ‌కు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ చేసిన సంద‌ర్భంగా ఉన్న లేఖ‌లో ఉన్న సంతకాల‌కు ఏ మాత్రమూ పొంత‌న లేద‌ని పేర్కొంటూ ఆయ‌న డీజీపీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ ఫోర్జరీ సంత‌కాలు, క‌ల్పిత డాక్యుమెంట్ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. 

 

అంతేగాకుండా.. ఈ లేఖ‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి... ఐపీ ఆధారంగా లేఖ ఎవ‌రు పంపారో గుర్తించి, ఆ నివేదిక ఆధారాంగా వెంట‌నే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. నిజానికి.. మొద‌టి నుంచీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ నిర్ణ‌యాలు తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల్లో బ‌ద్నాం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో నిమ్మ‌గ‌డ్డ చిక్కుల్లో ప‌డ్డ‌ట్టేన‌ని ప‌లువురు అంటున్నారు. 

 

నిమ్మ‌గ‌డ్డ గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న బాబోరి ప‌చ్చ పార్టీ క‌నుస‌న్న‌ల్లోనే ప‌ని చేస్తున్నార‌నేది నిర్విదాంశం. ఇక ఏపీలో ఆయ‌నే ఎన్నిక‌ల‌కు రెడీగా ఉండ‌మ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌య్యాక నోటిఫికేష‌న్ వ‌చ్చాక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఏక‌గ్రీవాల్లోనే వైసీపీ దూసుకుపోతోన్న వేళ స‌డెన్‌గా క‌రోనాను కార‌ణంగా చూపించి ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనే పెనుదుమారం రేపింది. దీనికి తోడు త‌న‌కు ఏపీలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల పేరిట బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయ‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త కావాల‌ని కూడా ఆయ‌న కేంద్ర హోం శాఖ‌కు లేఖ రాయ‌డం కూడా క‌ల‌క‌లం రేపింది.

 

ఇక ఆయ‌న సంత‌కాల్లో కూడా తేడాలు ఉన్నాయన్న ఆరోప‌ణ‌లు, ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే ఆయ‌న టీడీపీ డైరెక్ష‌న్‌లో వెళ్లార‌న్న సందేహాలే ఎక్కువుగా ఉన్నాయి. ఇక విజ‌య‌సాయిరెడ్డి రాసిన లేఖ ప్ర‌కార‌మే ఆయ‌న సంత‌కం ఫోర్జ‌రీకి గుర‌య్యి... అది నిజంగా టీడీపీ ఆఫీస్ నుంచి వెళ్లిన‌ట్టు తేలితే నిమ్మ‌గ‌డ్డ ఫ్యూచ‌ర్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదుగా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: