దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ ఏప్రిల్ 14న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ వెంట‌నే దాదాపుగా ప్ర‌యాణ స‌ర్వీసుల‌న్నీ కూడా మ‌ళ్లీ మే 3వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు అయ్యాయి. నిజానికి.. ఏప్రిల్ 14వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తార‌ని భావించిన రైల్వేశాఖ‌, ఆర్టీసీలు, విమాన‌యాన సంస్థ‌లు ముంద‌స్తు ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌కు అవ‌కాశం ఇచ్చాయి. దీంతో పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు టికెట్లు బుకింగ్ చేసుకున్నారు. కానీ.. అనూహ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ లాక్‌డౌన్ పొడిగించ‌డంతో ప్ర‌యాణ స‌ర్వీసులు మ‌ళ్లీ వాయిదా ప‌డ్డాయి.

 

మే 3వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు. దీంతో రైల్వేశాఖ కూడా 3 వ తేదీ వ‌ర‌కు రైళ్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు వెంట‌నే ప్ర‌క‌ట‌న కూడా చేసింది. తాజాగా.. మార్చి 22 నుంచి వచ్చేనెల 3 వరకు ప్రయాణికులు బుక్‌ చేసుకున్న 94 లక్షల టికెట్లను రద్దు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది.  ఈ మేరకు రూ.1490 కోట్ల మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. నిజానికి.. మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు రద్దు అయిన విష‌యం తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: