తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్ బంధువులిద్దరికీ కరోనా వైరస్ సోకింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సహరాన్‌పూర్ పట్టణానికి చెందిన మౌలానా సాద్ ఖాంధాల్వీ సమీప బంధువులైన ఇద్దరు మొహల్లా ముఫ్తీలుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చారు. మౌ లానా సాద్ బంధువులిద్దరూ ఆయనతో సన్నిహితంగా తిరిగారు. దీంతో వారిద్దరినీ పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.


కరోనా వచ్చిన వారిద్దరినీ ఫతేపూర్ లోని లెవెల్ 1 ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కరోనా రోగులున్న నివాసప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ హాట్ స్పాట్ గా గుర్తించి శానిటైజ్ చేశారు. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టరు కోరారు.

 

కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లీగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌  ఖాంధాల్వీపై సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేశారు. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారి కోసం పోలీసు బృందం గాలిస్తుందని కలెక్టరు చెప్పారు. ఒక్క సహరాన్‌పూర్ జిల్లాలోనే మర్కజ్ సమావేశానికి వెళ్లివచ్చిన 44 మందికి కరోనా పాజిటివ్ అని రావడంతో 19 కరోనా హాట్ స్పాట్ లుగా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: