చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడు 205 దేశాలకు విస్తరించి అతలాకుతలం చేస్తుంది.  భారత్ లో  ఈకరోన ఫిబ్రవరి నుంచి పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఎక్కువ శాతం ఇది విదేశీయుల నుంచి వచ్చింది.. అయితే ఆ మద్య ఢిల్లీలోని  నిజాముద్దీన్ మర్కజ్ లో ప్రార్ధనలు చేసిన వచ్చిన తర్వాత వారి నుంచి ఎక్కువగా విస్తరించిందని అంటున్నారు. దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది.  క్వారంటైన్‌ ముగియగానే తబ్లిగీ జమాత్‌ ప్రధాన నేత మౌలానా సాద్‌ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

 

సాద్‌ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.   అయితే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికి వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించిన ఆయనపై ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.   

 

అక్కడ నుంచి వెళ్లిన వారు పట్టణాల్లో గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు.. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకింది.  ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్‌పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: