బీమా పాల‌సీదారుల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ గుడ్ న్యూస్ చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించిన నేప‌థ్యంలోకీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాలసీదారులు తమ ఆరోగ్య, మోటారు బీమా పాలసీలను మే 15 వ తేదీ వరకు రెన్యూవ‌ల్ చేసుకోవ‌చ్చున‌ని ఆమె గురువారం ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో పాల‌సీదారుల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. అయితే.. ఈ అవ‌కాశం మార్చి 25 నుంచి మే 3 వ తేదీ మధ్య వచ్చే బీమా పాలసీల కోసం మాత్ర‌మేన‌ని ఆమె తెలిపారు.

 

ఈ నిర్ణ‌యంతో బీమా పాల‌సీదారుల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇదిలా ఉంగా.. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12, 380కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 414 మంది మ‌ర‌ణించారు. ఇక‌ 10,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు ఉన్నాయి. ఇందులో ముంబై న‌గ‌రం క‌రోనా వైర‌స్ కు హాట్‌స్పాట్‌గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: