క‌రోనా...ఇప్ప‌డీ పేరు వింటేనే ప్ర‌పంచం మొత్తం హ‌డ‌లెత్తిపోతోంది. కంటికి క‌నిపించ‌ని సూక్ష్మ‌జీవి ప్ర‌తి ఇంటినీ భ‌య‌పెడుతోంది. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు కూడా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే  కరోనా రాకుండా ప్ర‌జ‌లు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తున్నారు. మ‌రి కొందరు వీటితో పాటు ఆచారాలను నమ్ముకుంటున్నారు. 

 

తాజాగా నిర్మ‌ల్ జిల్లాలోని ఓ గ్రామంలో క‌రోనా రాకుండా ఉండేందుకు యువ‌కులు  ఏకంగా త‌మ తలనీలాలు సమర్పించారు. ముధోల్ మండలం చింతకుంట తండాలోని ఏకంగా 25 మంది యువకులు త‌మ ఇష్ట‌ దైవానికి పూజలు చేసి, తలనీలాలు సమర్పించారు. క‌రోనా నుంచి కాపాడాల‌ని కుల దైవానికి మొక్కులు చెల్లించుకున్నారు.  ఇదిలా ఉంటే నిర్మ‌ల్ జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజ‌గా  నిజామాబాద్ రెడ్‌జోన్ నుంచి బాసరకు వచ్చిన ఓ యువతితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: