మర్కజ్ నిజాముద్దీన్ సంఘటన అనంతరం కరోనా పాజిటివ్  కేసులు విపరీతంగా నమోదు అయ్యాయి. నిజామాబాద్ లో కూడా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయ్. నిజామాబాద్ లొ ఇప్పటి వరకు 55 పాజిటివ్ కేసులు ఉండగా ఒక్క ఆటో నగర్ ఏరియా నుంచి మరియు మాలపల్లి . ఖిల్లా ఏరియాలలో నుండి 35 కేసులు నమోదు అయ్యాయి.ప్రధానంగా జిల్లా కేంద్రం లొని ఆటో నగర్ కి చెందిన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలిస్తూ ఉండగా ఓ పోలీస్ అధికారి అడ్డుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ కరోనా పాజిటివ్ ఉన్న కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలిస్తూ ఉండగా స్వయంగా అడ్డుకున్నారు. అడ్డు కోవడమే కాకుండా దుర్భాషలాడారు.

 

క్వారంటైన్ కి తరలించడానికి మీదగ్గర సరైన అధరాలు ఉంటే చూపించమని విరుచుకు పడ్డాడు. ప్రధానంగా నిజామాబాద్ లోని ఆటో నగర్ ఏరియా అంతకుడా రెడ్ జోన్ గా ప్రకటించడమైంది. క్రితం ఆశ వర్కర్లను కూడా అనుమతించని పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వ విధులను ఆటంకపరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రకటించింది.  నిన్న సాయంత్రం 70 సంవత్సరాల వయసున్న ముసలి ఆవిడా కరోనా పాజిటివ్ తో చనిపోయారు. అయితే ముసలావిడ కుటుంబ సభ్యులను ముందు జాగర్త చర్యల క్రింద క్వారంటైన్ కి తరలించడానికి అధికారులు అక్కడికి చేరుకున్నారు .ఈ క్రమంలోనే నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ అక్కడికి వచ్చారు ఆ కుటుంభం సభ్యులను క్వారంటైన్ కి తరలిస్తూ ఉండగా అడ్డు పడ్డారు, మరియు అధికారులను దుర్భాషలాడారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: