లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయ్. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. తెలంగాణా సీఎం కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 19  న వివిధ శాఖల మంత్రులతో కేసీఆర్ భేటీకాబోతున్నారు. ఈ సమావేశం ప్రగతి భవన్ లో 19 తారీకు న మధ్యాహ్నం 2  : 30  నిమిషాలకు భేటీకానున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో లాక్ డౌన్ గురించి ప్రధానంగా చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించగా కేంద్రప్రభుత్వం మాత్రం మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.

 

అయితే ఈ లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించడమో లేక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మే 3 వరకు పొడిగించడమో అన్న విషయాలపై ముఖ్యంగా చర్చ జరుపనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తీసుకోవలసిన చర్యలగురించి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. లాక్ డౌన్ లో పరిశ్రమలకు మరియు రైతాంగానికి ఎంతమేరకు సడలింపులు ఇవ్వాల్సింది అనే అనే అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణాలో ఇప్పటివరకు 650  పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు ,118  మంది డీఛార్జి అయ్యారు మరియు 514  యాక్టీవ్ కేసులు తెలంగాణాలో ఉన్నాయ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: