ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంబిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఉన్న అప్‌డేట్‌ను బ‌ట్టి చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు 21 లక్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక కరోనా మ‌ర‌ణాలు 1.35 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా అయితే ప‌రిస్థితి చేయిదాటిపోయి తీవ్రంగా విల‌విల్లాడుతోన్న పరిస్థితి. అమెరికాలో పాజిటివ్ కేసులు 6.44 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. మ‌ర‌ణాలు 29 వేల‌కు చేరుకున్నాయి.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న స్పెయిన్ ఇట‌లీని బీట‌వుట్ చేసేసింది. స్పెయిన్‌లో తాజాగా వ‌చ్చిన 551 కొత్త మ‌ర‌ణాల‌తో క‌లుపుకుంటే మొత్తం మ‌ర‌ణాలు 19 వేలు దాటేశాయి. స్పెయిన్ వీథుల్లో మృత‌దేహాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే ఈ మ‌ర‌ణాలు స్పెయిన్లో 19 వేలు ఉండ‌గా.. ఇవి అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం 20 వేలకు పైగా మాటే అని.. ఇవి 25 వేలు దాటేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు. ఇక ఇట‌లీ, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీల్లో సైతం ఈ కేసులు ల‌క్ష దాటేశాయి.ఇక ఇంగ్లండ్ కూడా ల‌క్ష‌కు చేరువ‌లో ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: