భారత దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుందని.. లాక్ డౌన్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ సీరియస్ గా తీసుకోవడం లేదని.. ప్రజలు ఇంకా యదేచ్ఛగా రోడ్లపై తీరుగుతున్నారని అన్నారు.  అయితే  కొంత మంది పోలీసుల విధులకు ఆటంకాలు కల్పిస్తున్నారని.. అలాంటి వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటూ.. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలను కోరామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.  ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని, ఎక్కడా  అత్యవసరాలకు కొరత రాకుండా చూస్తున్నామని, వలస కూలీలకు ఆహారం, నిత్యావసరాలు సమకూరుస్తున్నామని అన్నారు.

 

కాగా, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్.. దేశంలో కోవిడ్ 19 వ్యాప్తి గురించి మొద‌టి నుంచి మీడియా కు వివరాలు అందిస్తున్న విషయం తెలిసిందే.  కంటైన్మైంట్ జోన్లలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.9 లక్షల మందికి పైగా ‘కరోనా’ పరీక్షలు నిర్వహించామని వివరించారు.  

 

మేకిన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించామని చెప్పారు. ఇదిలా ఉంటే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్న తెలిపారు.  ఇంకా దేశంలో కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కానందున ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: