కరోనా కట్టడి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కొన్ని ముందు చర్యలను పాటిస్తోంది అని ఏపీ హెల్త్ సెక్రట్రీ జవహర్ రెడ్డి  తెలియజేశారు. మొదటి అంశంగా పాజిటివ్ కేసులు వచ్చే క్లస్టర్ ఏరియా లనుండి వైరస్ ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలియా జేశారు. రెండొవ అంశంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి మెరుగైన వైద్య సదుపాయాలను అందించడం. 503  పాజిటివ్ కేసులకు గాను 154 క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు అయితే ఈ క్లస్టర్స్ లో కంటైన్మెంట్ చేస్తున్నట్లు చెప్పారు.

 

గడచి 14 గంటల్లో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మీడియాముఖంగా తెలియజేశారు. 7 వ  తారీకు వరకు వరకు 3 వేల కరోనా టెస్ట్ లు చేసినట్లు తెలిపారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ యొక్క లెక్క అధికమని చెప్పారు.అయితే ఇప్పటి వరకు 16555 టెస్టులు నిర్వహించినట్లు తెలియజేశారు. సాధ్యమైనంత ఎక్కువగా రక్తనమూనాలను పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం అని అయన తెలిపారు. ఇప్పటివరకు 7 DRDA లాబరేటర్స్ ap లో ఉన్నాయని తెలిపారు. ఈ  7 DRDA లాబరేటర్స్ లో  24 /7 పద్దతిలో టెస్టింగ్స్ చేస్తున్నట్లు తెలిపారు. మున్ముంతు అధిక మొత్తంలో కరోనా టెస్టులు చేసే సామర్థ్యం ap ప్రయత్నిస్తోందని తెలియజేశారు  

మరింత సమాచారం తెలుసుకోండి: