దేశంలో గత నెల 24 నుంచి కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆగిపోయాయి. అయితే కరోనా విషయంలో జాగ్రత్త కోసం లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  కరోనా ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్త వ్యస్తం అయ్యింది.  వాణిజ్య వ్యవస్థ కుంటు పడింది. రవాణా వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎలాంటి వెహికిల్స్ బయటకు రాకుండా చూస్తున్నారు పోలీసులు. తాజాగా ఇలాంటి కష్టకాలంలో కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసి సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. 

 

 కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్‌టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) సిబ్బందికి జీతాలు చెల్లిస్తామని కర్ణాటక రోడ్డు రవాణా మంత్రి లక్ష్మణ్ సావడి తెలిపారు.  కేఎస్ఆర్‌టీసీ, బీఎంటీసీ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ జీతాలు ఇవ్వకుండా వదిలిపెట్టబోమని లక్ష్మణ్ చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బంది సహా అందరికీ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందన్నారు.

 

అంతే కాదు మూడు నెలల  అడ్వాన్స్  చెల్లించాలని రవాణా శాఖ ప్రతిపాదించిందని, ఉద్యోగులకు ఒక నెల జీతం చెల్లించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప అంగీకరించారని తెలిపారు.   ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 315 కేసలు నమోదు కాగా.. 220 యాక్టీవ్ గా ఉన్నాయి. 82 మంది రికవరీ అయ్యారు.. 13 మంది మృత్యువాత పడ్డారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: