* కొవిడ్‌-19 అనేది ధనికుల వ్యాధి. ఇది పేద ప్రజలది కాదు. క‌రోనా వైర‌స్‌ను ధనవంతులు ఇతర దేశాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. వారు ఈ వ్యాధిని విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యాధి ఇక్కడ నుండి ఉద్భవించలేదు* అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. తమిళనాడు ప్రభుత్వం 18 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌పై కేంద్రం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌పై, ఏప్రిల్ 20వ తేదీ త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ క‌మిటీని ఏర్పాటు చేశారు.

 

ఇక రాష్ట్రంలో తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టివ‌ర‌కు 1242 కు చేరుకుంది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 14 కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118పైగా చేరింది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి మ‌రింత క‌ట్టుదిట్టం చ‌ర్య‌లు తీసుకునేందు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ను నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసే దిశ‌గా ముందుకు వెళ్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: