లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రికి ఎలాంటి ఇబ్బంది ఏర్ప‌డినా.. ఆప‌ద వ‌చ్చినా తెలంగాణ‌లో గుర్తుకు వ‌చ్చే పేరు కేటీఆర్‌. ఆక‌లితో అల‌మ‌టిస్తున్నా.. మందులు లేక ఇబ్బందులు ప‌డుతున్నా.. ఇంట్లో వండుకోవ‌డానికి బియ్యం లేకున్నా.. మ‌రెక్క‌డైనా ఆప‌ద‌లో చిక్కుకున్నా.. వెంట‌నే మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో పోస్టు పెడుతున్నారు. అంతేవేగంగా మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తున్నారు. వెంట‌నే సంబంధిత అధికారుల‌ను పుర‌మాయిస్తున్నారు. లేదా.. ఒక్కోసారి స్వ‌యంగా ఆయ‌నే రంగంలోకి దిగుతున్నారు. ఇలా ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకు మంత్రి కేటీఆర్ నిరంత‌రం కృషి చేస్తున్నారు. తెలంగాణ‌లో ఇలా నిత్యం అనేక ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ట్విట్ట‌ర్ వేదిక మంత్రి కేటీఆర్ స్పందిస్తున్న తీరుకు ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు.

 

తాజాగా.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక‌రు మెడిసిన్‌ కావాలంటూ ట్విట్ట‌ర్ పోస్ట్ చేశారు. ఆ.. ఏం చేస్తారులే అని అనుకున్నారు. కానీ.. మంత్రి కేటీఆర్ వెంట‌నే స్పందించి, ఆ వారికి అస‌వ‌ర‌మైన మందుల‌ను పంపించ‌డంతో కంగుతిన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. మీ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. దీనికి స‌ద‌రు వ్య‌క్తి కూడా స్పందించారు. *నేను టాబ్లెట్ల కోసం అభ్యర్థించినప్పుడు నాకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు మీరు పంపిస్తార‌ని. కానీ.. మీరు మా కోసం మా గ్రామానికి టాబ్లెట్లు పంపారు. కీలక సమయంలో నా గ్రాండ్ పేరెంట్స్‌కు సాయం చేసినందుకు మీకు, మీ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు.. మీరు రెండు ప్రాణాలను కాపాడారు* అంటూ ట్వీట్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: